” శాకిని డాకిని” చిత్రం విడుదల తేదీ ఖరారు

-

యంగ్ హీరోయిన్స్ రెజీనా కసెండ్రా, నివేత థామస్ ప్రధాన పాత్రలో ఓ యాక్షన్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొరియన్ సినిమా ” మిడ్ నైట్ రన్నర్స్” ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ” శాకిని డాకిని” అనే టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయినా.. తెలుగు పరిశ్రమ పరిస్థితి ప్రస్తుతం బాగుండడంతో రిలీజ్ కి రెడీ చేశారు. ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండవ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు శాకిని డాకినీ ప్రాజెక్టును రూపొందిస్తున్నాయి.

డి సురేష్ బాబు, సునీత తాటి, యోన్ వ్యూ థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రీఛర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా , మిక్కీ మిల్రేరీ సంగీతాన్ని అందిస్తున్నారు. శాలిని, దామిని అనే ఇద్దరు అమ్మాయిలు.. శాకిని డాకినీగా ఎలా మారిపోయారు అన్నది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సి ఉంది. ఈ చిత్రంలో డబుల్ ఫన్, డబుల్ యాక్షన్ ఉంటుందని దర్శక నిర్మాతలు విడుదలకు ముందే హామీ ఇస్తున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version