అమరవీరులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ డిమాండ్ చేశారు. గద్దర్ కు పద్మశ్రీ పురస్కారం ఇచ్చేది లేదని బండి సంజయ్ వాఖ్యలపై మెట్టు సాయికుమార్ తాజాగా స్పందించారు.
గాంధీభవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పద్మ అవార్డులు ఇచ్చేది కేంద్రమా? బీజేపీ పార్టీనా అని ప్రశ్నించారు.సేవా, కళ, సాహిత్య, వైద్య రంగాల్లో అందించే సేవలకు గాను పద్మ అవార్డులు ఇస్తారని, ఈ అవార్డులు బీజేపీ అధ్యక్షుడు ఇవ్వరని విమర్శించారు. తెలంగాణ అమరవీరులను, ప్రజాసంఘాలను అవమానించిన బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.