ఈ రోజు హైదరాబాద్ లోని శామీర్ పెట్ లో సిద్దార్ధ్ అనే వ్యక్తిపై మనోజ్ అనే వ్యక్తి గన్ తో కాల్చిన ఘటన సంచలనమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి ప్రముఖ సీరియల్ నటుడు అయిన మనోజ్ అనుకుని అతని పేరును, ఫోటోలను, ఇంస్టా వీడియోలను వాడుతూ ఇతనే గన్ ఫైర్ చేసింది అంటూ ఉదయం నుండి వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీరియల్ నటుడు మనోజ్ ఒక క్లారిటీ ఇచ్చాడు.. మీరు అంతా అనుకుంటున్నట్లు ఈ గన్ ఫైర్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ మనోజ్ నేను కాదు అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఎటువంటి నిజం తెలుసుకోకుండా.. కొన్ని మీడియా చానెళ్లు నా పేరును, ఫోటోలను వాడుకుని నన్ను డి ఫేమ్ చేశారంటూ బాధపడ్డాడు.