ఢిల్లీ వాసులను వణికిస్తున్న వానలు వరదలు

-

దేశ రాజధాని ఢిల్లీ మహానగరం ఇంకా వరద నీటిలోనే ఉంది. ఇప్పటికే వరద నీటితో ఉన్న ఢిల్లీకి భారత వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రానున్న 3 -4 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించిన ఐఎండీ.. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. యమునా నదిలో నీటి మట్టం తగ్గినప్పటికీ.. నది ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తుంది. శనివారం ఉదయం 8 గంటలకు యమునా నది నీటిమట్టం 207.58 మీటర్లుగా నమోదైంది. అయితే యమునా నది‌లో నీటి మట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి పెరగడంతో.. ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.

ఐటీవో, శాంతి వన్ ప్రాంతం, ఆదాయపు పన్ను కార్యాలయం, ఇతర కీలక ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి 11 గంటలకు యమునా నీటిమట్టం 207.98 మీటర్లుగా నమోదైంది. యమునా నీటి మట్టం తగ్గడంతో.. గురువారం మూసివేసిన ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాన్ని తెరిచారు. ఓఖ్లా వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను పునఃప్రారంభించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. శనివారం ఉదయం నాటికి యమునా నది నీటిమట్టాలు 207.7 మీటర్లకు తగ్గితే.. వజీరాబాద్‌, చంద్రవాల్‌లోని మరో రెండు నీటి శుద్ధి ప్లాంట్లను కూడా పునఃప్రారంభిస్తామని చెప్పారు.

అయితే…దీనిపై హరియాణా మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఆప్ చేసే ఆరోపణలను ఖండించారు. బ్యారేజ్ నుంచి నీళ్లు వదలడం తప్ప వేరే ఆప్షన్ లేదని తేల్చి చెప్పారు. ఎక్కువ నీళ్లు అలాగే ఉంచితే బ్యారేజ్ ధ్వంసమయ్యే ప్రమాదముందని అందుకే వదలాల్సి వచ్చిందని వివరించారు. ఎక్కువ మొత్తంలో నీరు నిల్వ ఉంచడానికి ఇది రిజర్వాయర్ కాదని స్పష్టం చేశారు. పరిమితి మించిన తరవాతే గేట్లు ఎత్తివేసినట్టు చెప్పారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా అరవింద్ కేజ్రీవాల్‌ హోంమంత్రికి లేఖ రాయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version