ఇంట్లో చెప్పకుండా పారిపోయిన ప్రేమజంటలకు దినదిన గండం నూరేళ్ల ఆయూష్యు మాదిరిగానే ఉంటుంది కొన్ని రోజులపాటు..ఎటువైపు ఎవరి బంధువుల ఎటాక్ చేస్తారో తెలియదు. కోరుకున్న వారిని దక్కించుకున్న ఆనందం కంటే..పిల్ల తాలకూ బంధువులు ఏం చేస్తారా అని ఆ అబ్బాయి..ఆ అబ్బాయి తాలుకూ చుట్టాలు ఏం చేస్తారా అని ఈ అమ్మాయి టెన్షన్ పడుతూ ఉంటారు. సాధారణంగా ఇలాంటీ సీన్స్ లో ఫ్రెండ్స్ హే వాళ్లకు అండగా ఉంటారు.
పోలీసులు కూడా కొన్ని సార్లు తల్లిదండ్రలు సైడ్ ఉంటారు. అయితే ఇండియాలోనే ఓ ప్రదేశంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నవారిని వంటిమీద ఈగకూడ వాల నీయకుండా జాగ్రత్తగా చూసుకునే ఆలయం ఉందట..దెయ్యాలకు ఆలయాల్లో ఎలా అయితే నో ఎంట్రీ ఉంటుందో..పాపం పోలీసులకు అక్కడ ఎంట్రీ లేదు. అక్కడివారు..ఎవరైనా ప్రేమపెళ్లి చేసుకుంటే మర్యాదగా వారికి సపర్యలు చేస్తారట. ఇంతకీ వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారు, ఆ అలయం ఎక్కడ ఉందో మీకు తెలుసుకోవాలని ఉంది కదూ..అయితే చూసేయండి..!
హిమాచల్ ప్రదేశ్..కూలింగ్ కి కేరాఫ్ అడ్రస్ ఈ రాష్ట్రం. మంచు కురుస్తూ ఉంటుంది. అక్కడ కుల్లూలోయ ఉంటుంది కదా.. అక్కడే ఉంది షాన్‌ఘర్ గ్రామం. ఆ గ్రామంలోకి పోలీసులు రారు. వారిపై అక్కడ నిషేధం ఉందట. ఆ గ్రామంలోని సైంజ్ లోయలో మహదేవుడి ఆలయం ఉంది. ఆ దేవుడి ప్రత్యేకత ఏంటంటే… సమాజంలో ఒంటరి అయిన వాళ్లకు ఈ దేవుడు రక్షణగా నిలుస్తాడట.
లవర్స్ అడ్డా
దేశవ్యాప్తంగా రోజూ పదుల సంఖ్యలో లవర్స్ ఈ ఆలయానికి వస్తుంటారు. దేవుడికి తమ గోడు చెప్పుకుంటారు. అక్కడే పెళ్లి చేసుకుంటారు. అలాంటి జంటలకు ఈ ఆలయంలో షెల్టర్ ఇస్తారు. అక్కడ కొన్ని రోజులు ఉండి, తినేందుకు వీలు కూడా కల్పిస్తారు. ఆలయ సమీపంలో ఉన్న వారిని ఎవరూ ఏమీ చెయ్యడానికి వీలు లేదు. ఎవరు వారిని టచ్ చెయ్యాలని చూసినా స్థానికులు దాన్ని మహా పాపంగా చూస్తారట. అది దేవుడికి వ్యతిరేక చర్యగా భావిస్తారు. అందువల్ల అక్కడికి వెళ్లిన లవర్స్ జోలికి ఎవరూ వెళ్లరూ.
స్థానికులే రక్ష
దేవుడి సమీపంలో కొన్ని రోజులు ఉన్నాక… ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక సందిగ్దంలో ఉన్న లవర్స్ కి స్థానికులు ఆదరిస్తారు. తమ దగ్గర ఉండమంటారు. అతిథి మర్యాదలు చేస్తారు. వాళ్లు అలా చెయ్యడానికి రెండు కారణాలు ఉన్నాయి. అలా లవర్స్‌ని కాపాడితే ఆ దేవుడి అనుగ్రహం తమపై ఉంటుందని వారి విశ్వాసం..అలాగే… ప్రేమికుల్ని కాపాడకపోతే ఆ దేవుడి ఆగ్రహం తమపై చూపిస్తాడని భయం.
పాండవుల అడుగుపెట్టిన ప్రదేశమట..!
పాండవులు వనవాసం చేసిన సమయంలో ఇక్కడకు వచ్చారట..వారిని కూడా ఇక్కడి వారు ఆదరించారట. ఆ సమయంలో… పాండవులను ఇక్కడి నుంచి పంపేందుకు కౌరవులు రాబోతుంటే మహదేవుడు వాళ్లను అడ్డుకున్నాడనీ… ఊళ్లో అడుగు పెట్టనివ్వలేదని ప్రతీతి. తమ దగ్గరకు వచ్చిన వారికి తాను రక్షణగా ఉంటానని స్వామి చెప్పడంతో… ఇక కౌరవులు వెనుదిరిగారని స్థానికులు అంటుంటారు.
పురాణాల్లోని ఈ కథనం ఆధారంగా… స్థానికులు ఈ ఆలయానికి వచ్చే ప్రేమికులను ఇప్పటికీ కాపాడుతుంటారు. ఇలా ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ ఆలయానికి ఎవరు వచ్చినా ఆయుధాలు తేవడానికి వీల్లేదు. అలాగే ఇక్కడ ఎవరూ గట్టిగా అరిస్తే ఒప్పుకోరు. గుసగుసలు ఆడినట్లు మాట్లాడుకోవాలట. ఈ కండీషన్లన్నీ ఇక్కడికి వచ్చే వారికి రక్షణ కోసమే. అందువల్లే ఈ ఆలయం ప్రేమికులకు స్వర్గధామంగా మారిందంటారు.
ఇది కేవలం ప్రేమికలు ఆలయం మాత్రమే కాదు..సాధరణ భక్తులు కూడా ఇక్కడి వస్తారు. బస్సు సదుపాయం కూడా ఉందట..అన్నీ కాలాల్లోనూ ఈ ఆలయం తెరిచే ఉంటుంది. వేసవి కాలంలో మాత్రం ఎక్కవు మంది వస్తుంటారట.