మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుపై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు

-

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మనస్ఫూర్తిగా మద్దతిచ్చాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారం అన్నారు. మహిళా సాధికారత కోసం గతంలో మహారాష్ట్ర, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలే చర్యలు చేపట్టాయని గుర్తుచేశారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన పవార్.. ‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్, ‘ఘమాంధీ’(అహంకారపూరిత) కూటమి మిత్రపక్షాలు అయిష్టంగానే మద్దతిచ్చినట్లు ప్రధాని మోడీ ఆరోపించారు. కానీ అది నిజం కాదు. మేమంతా ఈ బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చాం. దీనిపై ప్రధానికి తప్పుడు సమాచారం ఇచ్చారు’ అన్నారు.

1994 జూన్ 24న మహారాష్ట్రలో తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే.. దేశంలోనే తొలిసారిగా మహిళా విధానాన్ని ఆవిష్కరించిందన్నారు. అదే విధంగా, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చిందని తెలిపారు. స్థానిక ఈ చర్యల వల్లే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం కోటాకు మార్గం సుగమమైందని చెప్పారు. అలాగే తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పవార్ గుర్తు చేశారు.

ముంబై : విప‌క్ష కూట‌మి ఇండియాలో భాగ‌స్వామ్య పార్టీలైన ఆప్‌, కాంగ్రెస్‌లు పంజాబ్‌లో క‌త్తులు దూసుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది. విప‌క్ష ఇండియా కూట‌మిలో ఈ పార్టీలు భాగ‌స్వామ్య ప‌క్షాలుగా ఉన్నా పంజాబ్ అసెంబ్లీలో విప‌క్ష కాంగ్రెస్ నేత ప్ర‌తాప్ సింగ్ బాజ్వా, సీఎం భ‌గ‌వంత్ మాన్ మ‌ధ్య వైరం నెల‌కొంది. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్ వివాదం ప్ర‌భావం విప‌క్ష కూట‌మిపై ఉండ‌బోద‌ని శ‌ర‌ద్ ప‌వార్ స్ప‌ష్టం చేశారు. ఈ అంశాలు విప‌క్ష ఇండియా కూట‌మి భ‌విత‌వ్యంపై ప్ర‌భావం చూప‌వ‌ని ప‌వార్ పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version