“చంద్రసేన”దే విజయం.. 160 సీట్లు కంఫర్మ్: నిర్మాత అశ్వనీదత్

-

చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నప్పటి నుండి సినీ పరిశ్రమలో కొందరు పెద్దలు టీడీపీకి సపోర్ట్ గా కామెంట్ లు చేస్తూ వస్తున్నారు. నిర్మాత నట్టి కుమార్, నాగబాబు, పృథ్వి లాంటి వారు చంద్రబాబుకు మద్దతుగా చేయూతనిస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత వైజయంతీ మూవీస్ అధినేత అయిన అశ్వనీదత్ సైతం చంద్రబాబుకు మద్దతు పలికారు. ఈయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడులు ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమికి 175 కు గాను 160 సీట్లు ఖచ్చితంగా వస్తాయంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈయన చంద్రబాబు మరియు భువనేశ్వరి లను రాజమండ్రి జైలులో కలిసి దైర్యం చెప్పారు. అనంతరం అశ్వనీదత్ మాట్లాడుతూ చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సంపూర్ణ మెజారిటీని సాధించి అధికారంలోకి వస్తారని నమ్మకాన్ని తెలిపారు.

ఇక అశ్వనీదత్ టీడీపీ మరియు జనసేనలను కలుపుతూ చంద్రసేన గా వీరి కూటమిని నామకరణం చేశారు. మరి అశ్వనీదత్ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version