‘రెబల్’గా షర్మిల..ఆ కాన్ఫిడెంట్ ఏంటి?

-

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల..ఓ రెబల్ మాదిరిగా తయారయ్యారు. అసలు అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌పై ఒంటికాలిపై వెళుతున్నారు. ఆఖరికి ప్రధాన ప్రత్యర్ధులైన కాంగ్రెస్, బీజేపీ నేతలే ఆ స్థాయిలో విరుచుకుపడటం కనిపించడం లేదు..మాటకు మాట..తిట్టుకు తిట్టు..పంచ్‌కు పంచ్…అసలు ఈ విషయంలోనూ షర్మిల వెనక్కి తగ్గడం లేదు. ప్రతి దానికి కౌంటర్ ఇస్తున్నారు. ఆమె పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసినా..అరెస్ట్ చేసినా ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

 

టీఆర్ఎస్ నేతలు ఒకటి అంటే…షర్మిల నాలుగు అంటున్నారు. అంటే ఆ స్థాయిలో ఆమె కాన్ఫిడెన్స్ ఉంది. పైగా ఆమెది ఏపీ అని, అక్కడ రాజకీయం చేసుకోవాలని మాట్లాడుతుంటే..కేటీఆర్ భార్యది కూడా ఏపీనే అని, ఆమెకు విడాకులు ఇచ్చేస్తారా? అని చెప్పి భారీ కౌంటర్ వేశారు. తాను ఇక్కడే పెళ్లి చేసుకున్నానని, ఇక్కడే బిడ్డలని కన్నానని, తన జీవితం ఇక్కడే అని చెప్పుకొచ్చారు. తాజాగా బీజేపీ వదిలిన బాణం షర్మిల అని, బీజేపీ దత్తపుత్రిక అని చెప్పి టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

దీనికి కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేశారు. బీజేపీకి తాను దత్తపుత్రిక అని అంటున్నారు అని, మరి, కేసీఆర్‌ను బీజేపీకి పెళ్లాం అనాలా? బీజేపీ వాళ్లతో ఇన్ని రోజులూ చెట్టాపట్టాలు వేసుకుని డ్యూయోట్లు పాడుకున్నది కేసీఆర్‌ కాదా? అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందని, ఇక్కడి తాలిబన్లకు కేసీఆర్‌ అధ్యక్షుడు అని ఘాటుగా వ్యాఖ్యనించారు. ఆడదాన్నని చెప్పి తనను వ్రతాలు చేసుకోవాలంటూ కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని, ఆ మాటలకు ప్రతిగానే మొగతనం ఉంటే ఉద్యోగాలు ఇవ్వాలంటూ తాను వ్యాఖ్యానించానని, దీనికి తాను ఇప్పటికీ కట్టుబడే ఉన్నానన్నారు.

అంటే టీఆర్ఎస్ నేతలకు వేరే పార్టీ వాళ్ళు కౌంటర్లు ఇచ్చారు గాని..ఇలాంటి కౌంటర్లు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. అసలు ఫైర్ బ్రాండ్ నాయకులు అంటే వేరు..దాన్ని మించి రెబల్ నాయకురాలుగా షర్మిల..టీఆర్ఎస్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌ వాళ్ల బెదిరింపులకు తాను బెదిరేది లేదని.. ఉదయించే సూర్యుడిని, వైఎస్సార్టీపీనీ ఎవ్వరూ ఆపలేరని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మరి ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version