కమిషన్ల కోసం కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చు..లిక్కరు ఏరులై పారొచ్చు.. కాని రైతు పండించిన పంట కొనలేరా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించింది. బడి పిల్లలకు బువ్వ పెట్టరాదా? కొత్త రేషన్ కార్డులు ఇవ్వకూడదా? ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయచాతకాదా? అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాలన చేతకాక కేసీఆర్ ధర్నాలు మాత్రమే చేస్తున్నరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తూ, బడి బువ్వ బంద్ పెట్టి పేద బిడ్డలకు చదువును దూరంచేస్తూ నేటి తెలంగాణాను, రేపటి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారు దొరగారు అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఈ పాపం నాది కాదు అన్నట్టు, ఈ రోజు రైతుల పేరుమీద దొంగ దీక్షలు చేస్తున్నవ్ పాపప్రక్షాళన చేసుకోవడానికి ధర్నాలు చేస్తున్న మీరు ముమ్మాటికీ రైతు ద్రోహే అంటూ కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
మరో రైతు గుండె ఆగకముందే తడిసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఆఖరి గింజవరకు కొనాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ షర్మిల హెచ్చరించింది. పంట నష్టపోతే ఆదుకోవు….ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొస్తే కొనవ్..మీరు కొంటారో కొనరో తెలియక, కొనుగోలు కేంద్రాల్లో వానకు తడిసికళ్ళముందే పంట కొట్టుకుపోతుంటే తట్టుకోని రైతు గుండెలు ఆగిపోతుంటే మీకు కనపడవు అంటూ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. మద్దతు ధర రాక పోయిన ప్రాణాలు మీకు తెలియవ్ అంటూ కేసీఆర్ ప్రభుత్వం పై షర్మిల నిప్పులు చెరిగారు.