ఢిల్లీ రైతుల ఆందోళనపై కేసీఆర్‌ సంచలన ప్రకటన.. చివరి రక్తం బొట్ట వరకు పోరాడతాం !

-

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. టిఆర్ఎస్ భారత రైతుల సమస్యల మీద లీడ్ తీసుకుంటుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. మిమ్మల్ని మేము వదలం, చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఎస్సి వర్గీకరణ మీద అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే పట్టించుకోవడం లేదని… ప్రతి ఎన్నికలెప్పుడూ మత విద్వేషాలు రెచ్చ గొట్టి లబ్ది పొందుతున్నారని మండిపడ్డారు.

KCR-TRS

వడ్ల కోసం పోరాటం మొదలు పెట్టినం, దేశం కోసం కూడా పోరాటం చేస్తామని… దేశానికి విద్యుత్ ఇచ్చే తెలివి లేదు, కానీ మోటర్లకు మీటర్లు పెట్టాలట అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.
సర్జికర్ స్ట్రిక్ లు, సరిహద్దు డ్రామాలు బయట పడ్డాయని… ఇక మీ డ్రామాలు నడవని వార్నింగ్‌ ఇచ్చారు. నీళ్ల విషయం కేంద్రం రాష్ట్రాల మధ్య తగువులు పెడుతోందని… వడ్లు పండక పోతే బీజేపీ వాళ్లు ఏం పీకడానికి కల్లాల దగ్గరకు పోతున్నారని ఆగ్రహించారు. ఈ గోల్ మాల్ గాళ్లకు గోరి కట్టాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version