ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల జోరును పెంచేశారు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సవాన్ని నింపడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు షర్మిల. అయితే దీనిలో భాగంగానే ఈరోజు నుండి రాష్ట్ర పర్యటనకి శ్రీకారం చుట్టారు. జనవరి 23 నుండి 31 వరకు తొమ్మిది రోజులు పాటు వివిధ జిల్లాల్లో షర్మిల పర్యటించబోతున్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి షర్మిల పాదయాత్ర మొదలైంది ఉదయమే ఇచ్చాపురం కి చేరుకున్నారు షర్మిల. అక్కడ కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. శ్రీకాకుళంలో కాంగ్రెస్ పరిస్థితి గురించి తెలుసుకుని షర్మిల బలోపేతానికి ఏం చేయాలో కూడా చర్చించారు.
ఏపీ ప్రజలకి మేలు జరగాలని ఇచ్చాపురం నుండి ప్రస్థానం మొదలు పెట్టినట్లు షర్మిల చెప్పారు కాంగ్రెస్ కి రాజశేఖర్ రెడ్డి ఎంత చేశారో రాజశేఖర్ రెడ్డికి కూడా కాంగ్రెస్ అంతే చేసింది అన్నారు కాంగ్రెస్ వైఎస్ కుటుంబం ఇబ్బంది పెట్టింది అనడంలో వాస్తవం లేదని షర్మిల చెప్పారు. రాజశేఖర్ రెడ్డి బిజెపికి వ్యతిరేకి ఆ సిద్ధాంతాలని వ్యతిరేకించారు అన్నారు బిజెపి మతతత్వ పార్టీ అని షర్మిల అన్నారు ఏపీలో మొత్తం బిజెపిని ప్రజలు తృణీకరిస్తే పాలకులు మాత్రం బిజెపికి బానిసలు అయిపోయారని ఆమె ఆరోపించారు.