సొంత ఇళ్లలోనే మహిళలకు గౌరవం లేదు.. మహిళా దినోత్సవాన షర్మిల కీలక వ్యాఖ్యలు !

-

లోటస్ పాండ్ లోని వైయస్ షర్మిల కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన షర్మిల, తెలంగాణలో మొదటి విద్యుత్ లైన్ ఉమెన్ భారతిని సన్మానించారు. అనంతరం ఈత, తాటి చెట్లు ఎక్కి కల్లు తీస్తు జీవనం సాగిస్తున్న సావిత్రిని, వనిత గ్యారేజ్ నడుపుతున్న ఖమ్మం అదిలాక్ష్మిని సన్మానింనించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ అవసరం అయినప్పుడు పోరాటం చేయాలని, అవకాశాలు మనమే సృష్టించాలని అన్నారు. అవసరం అయినప్పుడు నడుం బిగించాలి, మార్పు సాధించాలని పిలుపునిచ్చారు.

మహిళల త్యాగాలని గుర్తించాలని కాదు… కిరీటాలు పెట్టాలని కాదు, సొంత ఇళ్లలోనే మహిళలకు గౌరవం లేదని అన్నారు. మహిళల్లోనే మార్పు రావాలి. మార్పుకు నాంది స్త్రీ అని ఆమె అన్నారు. తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిధ్యం ఎంత ? అని ప్రశ్నించిన ఆమె తెలంగాణ రాజకీయ చైతన్యానికి అడ్డా అని, రాణి రుద్రమదేవి నుంచి మొదలుకొని ఎంతో మంది మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు ఘోరంగా అన్యాయం జరిగిందని వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు మంత్రులగా అవకాశం కల్పించారని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version