సింగరేణి కాలనీలో చిన్నారి ఇంటి ముందు షర్మిల దీక్ష.. భగ్నం చేసిన పోలీసులు

-

హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం యావత్ దేశాన్ని కదిలించింది. ప్రపంచం తెలియని పసిపాపపై జరిగిన ఘాతుకానికి యావత్ దేశం కోపోద్రిక్తంగా గురైంది. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. పట్టిస్తే పది లక్షలు అని పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. ఐతే చిన్నారి కుటుంబానికి జరిగిన అన్యాయంపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. వైయస్సార్టీపీ అధినేత షర్మిల చిన్నారి ఇంటి వద్ద దీక్షకు పూనుకున్నారు.

చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని తెలిపారు. సింగరేణి కాలనీలో చిన్నారి ఇంటి వద్ద షర్మిల దీక్ష ప్రారంభించారు. ప్రస్తుతం ఈ దీక్షను పోలీసులు భగ్నం చేసారు. దీక్ష భగ్నం చేసిన పోలీసులు లోటస్ పాండ్ కు తరలించారు. ఈ మేరకు లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు వాహనం దిగకుండా షర్మిల అలానే కూర్చున్నారు. అటు వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని, చిన్నారి కుటుంబానికి 10కోట్లు ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version