ష‌ర్మిల‌కు ఎన్ని ఇబ్బందులో.. దీక్ష చేస్తానంటే ఎవ‌రూ రావ‌ట్లేదంట‌..!

-

వైఎస్ ష‌ర్మిల‌ sharmilaకు ఎన్ని చేసినా కూడా ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. కానీ ఆమె అవేవీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ మీద సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నా కూడా ఆమెను క‌నీసం ఎవ‌రూ ప‌ట్టించుకోకుండా ప‌క్క‌న పెట్ట‌డంతో నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ష‌ర్మిల‌కు విప‌రీతంగా త‌ల‌నొప్పిగా మారింది.

మొద‌టి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ మీదే త‌న ఉద్య‌మాన్ని న‌డిపిస్తున్న ష‌ర్మిల ప్ర‌తి మంగ‌ళ‌వారం రోజు షర్మిల ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాల వ‌ద్ద నిరాహార దీక్ష‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు (మంగ‌ళ‌వారం) నాడు కూడా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో రీసెంట్‌గా సూసైడ్ చేసుకున్న నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి అక్క‌డే కాసేపు నిరాహార దీక్ష చేశారు.

అయితే ఆమె దీక్ష‌కు క‌నీసం గ్రామాల్లోని వార్డు మెంబ‌ర్లు కూడా రావ‌ట్లేదంట‌. కేవ‌లం స్థానికంగా ఉంటున్న వైఎస్ అభిమానులు మాత్ర‌మే వ‌స్తున్నారంట‌. ఇక జ‌నాలు పెద్ద‌గా లేక‌పోతే ప‌రువు పోతుంద‌ని ఏకంగా హైదరాబాద్ నుంచి వాహనాల్లో జనాలను, కొంద‌రు నేతలను ఆమె వెళ్లేకంటే ముందే ఆయా గ్రామాలకు తర‌లిస్తున్నారంట‌. దీంతో ఈ విష‌యం ఆయా గ్రామాల్లోని ఇత‌ర పార్టీ నాయ‌కుల‌కు తెలిసి విప‌రీతంగా ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. క‌నీసం ఆమె ఉంద‌ని కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని దారుణ‌మైన కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version