మీకు దమ్ముంటే అభివృద్ది పై చర్చపెట్టండి…నేను వస్తానని టిఆర్ఎస్ కు షర్మిల సవాల్ విసిరారు. షాద్ నగర్ ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్ అట. ఇద్దరు కొడుకులదే అధికారమట. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండి ఏం చేసినట్టు? డిగ్రీ కాలేజీ లేదు. ఇంటర్ కాలేజీ లేదు. పిల్లలు రోడ్ల మీదికొచ్చి ధర్నాలు చేస్తే కేసులు పెట్టారట. ఇదేం దిక్కుమాలిన పాలన ? అని నిలదీశారు.
పాలమూరు ఎమ్మెల్యేలకు జనాలు ప్రశ్నిస్తే ఎదుర్కునే దమ్ము లేదు. నేను ప్రశ్నిస్తే.. జవాబు చెప్పే దమ్ము లేదు. ఈ చేతగాని దద్దమ్మలు కుమ్మక్కై స్పీకర్ గారికి కంప్లయింట్ చేస్తారట. మీకు దమ్ముంటే చర్చపెట్టండి. రావడానికి నేను సిద్ధమన్నారు. అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న కేసీఆర్.. ఆ హామీని గాలికొదిలేశాడు. ముస్లింలు పేదరికంలో ఉన్నారని ఆలోచించి, వారికి 4శాతం రిజర్వేషన్ అమలు చేసి, ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత వైయస్ఆర్ కే దక్కుతుందని తెలిపారు షర్మిలా.