ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. కెసిఆర్ జాతీయ పార్టీపై షర్మిల సెటైర్లు

-

సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సెటైర్లు వేశారు. ఈ దరిద్రం మనకు చాలదు అన్నట్లు ఇప్పుడు దేశాల మీద పడతాడట అంటూ ఎద్దేవా చేశారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడట అలా ఉంది కేసీఆర్ తీరు అని అన్నారు. ఓవైపు రైతులు, నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోవడం తెలియదు కానీ జాతీయ రాజకీయాలలోకి వెళతానంటున్నాడని మండిపడ్డారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. గూట్లో రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాడట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ” బంగారు తెలంగాణ అయిందా? ఎవరికి అయ్యింది బంగారం. కెసిఆర్ కుటుంబానికి అయింది బంగారం. ఆయన కొడుకులకు, అల్లుళ్లకు అయ్యింది బంగారం. 8 ఏళ్లలో ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంది. రైతులకు భరోసా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఏ వర్గాన్ని అయినా కేసీఆర్ ఆదుకున్నారా?”. అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version