ముక్కు నేలకు రాసి వెనక్కి వెళ్తా – కేసీఆర్ కు షర్మిల ఛాలెంజ్

-

కేసీఆర్ కు షర్మిల ఛాలెంజ్ విసిరారు. ప్రజలకు సమస్యలే లేవని, అంతా అద్భుతంగా ఉందని చెబుతున్న కేసీఆర్ కు సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే మాతో పాదయాత్రకు రండి.. సమస్యలు లేవని తేలితే ముక్కు నేలకు రాసి వెనక్కి వెళ్తానన్నారు. సమస్యలు ఉన్నాయని తేలితే రాజీనామా చేసి, దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తావా? అని నిలదీశారు షర్మిల.

వైఎస్ షర్మిల

గురిజాల గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్.. ఒక్క పని కూడా చేయలే. నేటికీ వైయస్ఆర్ వేసిన రోడ్లే ఉన్నయ్. నర్సంపేటకు మిర్చి పరిశోధన కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ తీసుకొస్తానని మాటలు చెప్పి, మోసం చేసిండు. రాళ్ల వానతో పంట నష్టపోయి.. ఏడాది కావొస్తున్నా నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు షర్మిల.

YSR గారు నర్సంపేటలో 65 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే రంగయ్య రిజర్వాయర్ తో పాటు పాకాల, ఎస్సారెస్పీ కాలువలు నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. 8 సబ్ స్టేషన్లు, 4 కస్తూర్భా స్కూళ్లు, 30వేల పక్కా ఇండ్లు నిర్మించారు. మరి KCR ఏం చేసినట్టు? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version