ఈరోజు బీఆర్‌కే భవన్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి 2 వ విడత గొర్రెల పంపిణీ పై జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాలుగోన్నారు. అక్కడ మంత్రి తలసాని మాట్లాడుతూ, రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని 2017 లో ప్రారంభించగా రాష్ట్రంలో 7.31 లక్షల మంది గొర్రెల పెంపకందారులను అర్హులుగా గుర్తించామని తెలియచేసారు మంత్రి తలసాని .
మొట్ట మొదటి విడతలో 50 శాతం మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామని తెలిపారు ఆయన. మిగిలిన వారికి రెండవ విడతలో పంపిణీ చేస్తామని తెలిపారు. గొర్రెల రవాణాకు జీపీఎస్ సౌకర్యం తో కూడిన వాహనాలను ఉపయోగిస్తామని తెలిపారు మంత్రి తలసాని. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన గొర్రెల సంపదకు అనుగుణంగా దాణా కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు చేపట్టారు ఆయన. లబ్ధిదారులు తమ సొంత భూములలో పశుగ్రాసం పెంచుకొనేందుకు సబ్సిడీపై గడ్డి విత్తనాలను కూడా సరఫరా చేస్తామని తెలిపారు మంత్రి తలసాని.