HMDA : శివ బాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. శివ బాలకృష్ణ కేసులో అతని సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. ఇక శివ బాలకృష్ణ కేసులో తవ్వినా కొద్ది వెలుగులోకి ఆస్తులు వస్తున్నాయి. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్ దంపతులు, భరత్ పేర్లతో పాటు మరి కొంత మంది కుటుంబ సభ్యులు పేరుతో భూములు, ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శివనవీన్ పేరు మీదే ఉన్న శివబాలకృష్ణ ఇంట్లో ల్యాండ్ డాక్యుమెంట్లు దొరికాయి.
ఈ డాక్యుమెంట్లు పై సరైన సమాధానాలు చెప్పలేదు నవీన్. దీంతో శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ ను అరెస్టు చేసింది ఏసీబి. శివబాలకృష్ణకు శివనవీన్ బినామీగా ఉన్నట్లు గుర్తించారు. శివనవీన్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఏసీబి…ఇప్పటికే శివబాలకృష్ణ భార్య బంధువు నవీన్ వద్ద పలు ఆస్థి పేపర్లు ఉన్నట్లు గుర్తించారు.రెండు రోజుల పాటు హెచ్ఎండీఏ.కార్యాలయంలో సోదాలు నిర్వహించింది ఏసీబి. ఇక ఈ రోజుతో శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగియనుంది. శివబాలకృష్ణ కస్టడిని పొడిగించాలని కోర్టును కోరనుంది ఏసీబీ.