ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలతో బిజీగా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆయనపై విమర్శలు గుప్పిస్తుంటే.. అదే సమయంలో హైపర్ ఆది లాంటివాళ్ళు జనసేనకి మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు బహిరంగంగానే పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటిస్తూ అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీ నాయకులపై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు శివ బాలాజీ కూడా పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
జనసేన పార్టీకి సపోర్టుగా తమ కుటుంబం మొత్తం ఉంటామంటూ నటుడు శివబాలాజీ ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మధుమిత, శివబాలాజీ దంపతులు మాట్లాడుతూ పవన్ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివ బాలాజీ మాట్లాడుతూ..” నేను కూడా పవర్ స్టార్ కి పెద్ద అభిమానిని.. అయితే నాకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదు. రాజకీయాలలోకి వచ్చే ఆలోచన కూడా లేదు. కానీ నేను ముందు నుంచి పవన్ సార్ కి సపోర్టుగా ఉన్నాను.. ఆయన స్థాపించిన నాటి నుంచి జనసేన పార్టీకి మద్దతుగా ఉన్నాను . రాజకీయాల్లోకి రాను కానీ ఆయన ఒక మాట చెబితే చాలు పార్టీ కోసం మరింత క్రియాశీలకంగా పనిచేస్తాను.
మా సోషల్ మీడియా ద్వారా పవన్ సార్ కోసం పనిచేస్తాము. నూటికి నూరు శాతం ఆయన కోసం కష్టపడి పని చేస్తాము. పవన్ సార్ కి ఓపిక ఎక్కువ.. ఆయనకున్న క్రేజ్, పాపులారిటీతో సినిమాలు చేసుకుంటూ కోట్లు వెనకేసుకోవచ్చు. కానీ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి కష్టపడుతున్నారు. కాబట్టి ఎప్పటికైనా మా మద్దతు పవన్ సార్ కే ఉంటుంది” అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు శివ బాలాజీ. ప్రస్తుతం శివబాలాజీ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.