ఏపీ రేషన్ కార్డు దారులకు శుభవార్త. రేషన్ బియ్యాన్ని ఇక పూర్తి ఉచితంగా అందించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు కిలోకి రూపాయి తీసుకునే వారు ఇకనుంచి పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇప్పటికే సంక్షేమ పథకాలతో భరోసా ఇస్తున్న సర్కారు నూతన సంవత్సరం నుంచి జిల్లాలో ఉచిత రేషన్ అమలుచేయనుంది.
ప్రతి నెల 16,474 మెట్రిక్ టన్నులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున రేషన్ బియ్యాన్ని అందిస్తూ కిలో ఒక్క రూపాయికే ప్రభుత్వం సరాఫరా చేస్తుంది. ఇక నుంచి నూతన సంవత్సరంలో సంవత్సరం పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.