శివాజీ పురాణం..నమ్మేది ఎవరు గురు!

-

గరుడపురాణం..ఇదేదో పురాణాలకు సంబంధించిది కాదు…గత ఎన్నికల ముందు ఏపీలో నటుడు శివాజీ చెప్పిన గరుడ పురాణం స్టోరీ…అప్పుడు మీడియా ముందుకొచ్చి…ఒక బోర్డు మీద శివాజీ…ఏపీలో జరుగుతున్న రాజకీయ కుట్రలు అంటూ ఒక గరుడ పురాణం చెప్పిన విషయం తెలిసిందే…కేంద్రంలో ఉన్న ఒక పార్టీ..ఏపీని దక్కించుకోవడం కోసం కొత్త ఎత్తులతో వస్తుందనేది శివాజీ కాన్సెప్ట్..

అబ్బో ఆయన ఏ విధంగా పురాణం చెప్పారో అందరికీ తెలిసిందే…మరి శివాజీ చెప్పిన పురాణం నిజమైందో లేదో జనాలకే బాగా క్లారిటీ ఉందని చెప్పొచ్చు. ఏదో రాజకీయంగా హైలైట్ అవ్వడానికి శివాజీ ఒక స్టోరీ చెప్పారు…ఎంతైనా సినిమా నటుడు కాబట్టి…కథని ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.

ఈ కథని కొందరు నమ్మారు…కానీ కొందరు నమ్మలేదు. ఇక ఇప్పుడు ఆ స్టోరీ ఏమైందో ఎవరికి తెలియదు. అలా గరుడ పురాణం అంటూ కథలు చెప్పిన శివాజీ ఈ మధ్య జోస్యం కూడా చెబుతున్నారు. రాజకీయంగా ఉద్యమాలు చేసేవారికి మద్ధతు ఇవ్వడంలో తప్పులేదు…అలాగే ఒక పార్టీకి మద్ధతుగా మాట్లాడిన ఇబ్బంది లేదు. కానీ ఏదో అంతర్గత రాజకీయాలు ఈయనకే తెలుసు అన్నట్లు చెప్పుకొచ్చేస్తారు.

తాజాగా అమరావతి వెళ్ళి రైతులకు మద్ధతు తెలిపిన శివాజీ..అక్కడ మాట్లాడుతూ వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సినిమా మొత్తం అయిపోయిందని, ఓటుకు రూ.50వేలు ఇచ్చినా ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.

అవును ఇదే జోస్యమే తప్ప…నిజం కాదనే చెప్పాలి…గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా శివాజీ ఏదో హైలైట్ అవ్వాలని అన్నట్లు కథలు చెప్పినట్లే కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు…వేరే పార్టీ అంటే టీడీపీనే. అసలు ఏపీ రాజకీయాల్లో అలాంటి పరిస్తితులు లేవు…కానీ ఏదో రాజకీయంగా వైసీపీకి నష్టం చేయాలని చెప్పి ఓ కథ చెప్పేశారు..కాబట్టి శివాజీ పురాణాలు ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version