కన్నతల్లిని తీవ్రంగా కొట్టి చంపిన కేసులో నిందితుడైన కుమారుడికి జీవిత ఖైదు విధిస్తూ కరీంనగర్ ఫ్యామిలీ కోర్టు అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మాధవి కృష్ణ తీర్పు చెప్పారు. చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన పోలుదాసరి కొండయ్య మద్యం సేవించి తల్లితో గొడవ పడి ఆమెను తీవ్రంగా కొట్టగా మరణించింది. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో అతనికి జీవితఖైదు విధించారు.