తాజాగా మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణలో భాగంగా ఇటీవల వచ్చిన కొత్త మంత్రులకు శాఖలు కేటాయించని విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో సందిగ్ధత నెలకొని ఉన్న సమయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ విషయానికి తెరదించారు. ఆదివారం నాడు క్యాబినెట్ లోని కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఏ మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలన్న విషయంలో శివరాజ్ సుదీర్ఘ కసరత్తు చేశారని తెలుస్తోంది.
అయితే రాష్ట్రంలోని కొన్ని పోర్ట్ పోలియోల విషయంలో జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి, అలాగే మొదటి నుండి బీజేపీలోనే కొనసాగుతున్న వారి మధ్య ఒక సరైన అభిప్రాయం రాకపోవడంతో మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నేడు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరువర్గాలకు నచ్చచెప్పి ఆదివారం నాడు కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు ఉన్నట్లు ముహూర్తాన్ని ఖరారు చేశారు.