సింగర్ మనో ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్..!!

-

సింగర్ మనో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు పేరు నాగూర్ బాబు. అయితే తన పేరును మాత్రం సింగర్ మనో గా మార్చుకున్నాడు. ఈయన సింగర్ కాక ముందు వరకు చక్రవర్తి దగ్గర సహాయకుడిగా పనిచేశారు. ఇక ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం దగ్గర కూడా ఎన్నో వేల పాటలకు ప్రదర్శనలు కూడా చేశారు. సినిమాలో దాదాపుగా 30 వేలకు పైగా పాటలు పాడారు మనో. ఇక కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ్, కన్నడ ,బెంగాలీ వంటి భాషలతో సహా 11 భాషలలో ఆయన పాటలు పాడడం గమనార్హం.

ఇక అంతే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆయనకు ఒక సెపరేట్ స్టైల్ ఉందని చెప్పవచ్చు. ఈయన పుట్టి పెరిగింది ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెన్నపల్లి . ఈయన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎంతో చక్కగా పాటలు పాడతారు. ఇక ఈయన తండ్రి ఆలిండియా రేడియోలో కూడా పనిచేసేవారు. మనో కు చిన్న వయసు నుంచే సంగీతం అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండడంతో నేదునూరు కృష్ణ మూర్తి దగ్గర ఈయన తండ్రి సంగీతం నేర్చుకోడానికి పంపించారు. అయితే ఈయనని మనో గా మార్చింది మాత్రం ఇలయరాజ.

ఇక ఈయన సింగర్ గానే కాకుండా కొన్ని చిత్రాలలో కూడా నటించాడు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఒక అమ్మాయి కాగా చిన్నవయసులోనే ఒక కుమారుడు మరణించారు. ఇక అసలు విషయంలోకి వెళితే మనో బిజినెస్, రియల్ ఎస్టేట్ వైపు అడుగు పెట్టడంతో వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దాదాపుగా రూ.560 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు గా సమాచారం. ప్రస్తుతం ఇప్పుడు కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు. మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్ గా కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు మనో.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version