గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టాన్ని రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో పడేసింది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ పలుమార్లు ప్రస్తావించారు. ధరణి లోపాలను సరిదిద్దేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భూభారతి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమావేశాలను సైతం ఏర్పాటుచేశారు.
ఈ క్రమంలోనే శనివారం గద్వాల్ జిల్లాలో ఏర్పాటు చేసిన భూభారతి సదస్సులో సరిత వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ నాయకురాలు అయిన సరితను వేదికపైకి పిలవక పోవడంతో ఆమె వర్గీయులు నిరసన చేపట్టారు. అయితే,
ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సైతం వేదిక మీదకు వెళ్లలేదని తెలిసింది. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిపై లాఠీచార్జి చేశారు.