మావోయిస్ట్ పార్టీ కి షాక్ ! ఎన్ కౌంట‌ర్ లో పెద్ద నేతలు?

-

మావోయిస్ట్ కేంద్ర క‌మిటీ భారీ షాక్ త‌గిలిన‌ట్టు తెలుస్తుంది. మ‌హా రాష్ట్ర లోని గ్యారాప‌త్తి అడువుల్లో జ‌రిగిన భారీ ఎన్ కౌంట‌ర్ లో మావోయిస్ట్ పార్టీ కి సంబంధించిన ప‌లువురు కీలక నేత‌లు ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మృతుల సంఖ్య 26 ఉండ‌గా వారిలో ప్ర‌ధాన మైన నేతలు ఉన్న‌ట్టు తెలుస్తుంది. అందు లో ఒక్క‌రు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు మ‌ధ్య ప్ర‌దేశ్ మ‌హారాష్ట్ర ఛ‌త్తీస్ గ‌ఢ్ జోన్ లో మావోయిస్ట్ ల రిక్రూట్ మెంట్ తో పాటు విస్త‌ర‌ణ బాధ్య‌త‌లు నిర్వ‌హించే మిలింద్ బాబూ రావ్ తెల్లుంబ్డే ఉన్న‌ట్టు తెలిస్తుంది.

ఆయ‌న‌ను జీవా అలియాస్ దీపక్ తేల్టుంబ్డే అని కూడా పిలుస్తారు. అయన తో పాటు మావోయిస్ట్ పార్టీ ద‌ర్భా క‌మిటీ స‌భ్యుడు సుఖ్ లాల్ కూడా ఉన్నార‌ని తెలుస్తుంది. అయితే ఈ విష‌యాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ లేదు. మృతి చెందిన 26 మంది పూర్తి వివ‌రాలు ఇంక తెలియాల్సి ఉంద‌ని గ‌డ్చిరోలి ఎస్పీ అంఖిత్ గోయ‌ల్ తెలిపాడు. కాగ ఈ ఎన్ కౌంట‌ర్ ఉద‌యం 6:30 గంటల నుంచి సాయంత్రం వ‌ర‌కు జ‌రిగింద‌ని తెలుస్తుంది. గంట గంట‌కు మృతుల సంఖ్య పెరిగింది. మొద‌ట 11 మంది మృతి చెందారని తెలిసింది. తర్వాత కొన్ని గంట‌ల త‌ర్వాత మృతుల సంఖ్య 26 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version