SHOCKING: వరల్డ్ కప్ నుండి బంగ్లాదేశ్ అవుట్ !

-

కాసేపటి క్రితమే ముగిసిన పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో బాబర్ ఆజామ్ సేన 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుని ఇంకా సెమీస్ కు పోటీలోనే ఉంది. ఇక సెమీస్ రేస్ లో నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో 204 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది, ఆ తర్వాత పాకిస్తాన్ ఈ స్కోర్ ను మరో 17 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఛేదనలో ఓపెనర్లు జమాన్ (81) మరియు షఫీక్ (68) లు రాణించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు బౌలింగ్ లో ఆఫ్రిది మరియు మహమ్మద్ వసీం లు చెరో మూడు వికెట్లు తీసుకుని బంగ్లా పతనాన్ని శాసించారు.

ఈ విజయంతో ఇంకా పాకిస్తాన్ కు సెమీస్ కు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అందుకు చాలా జట్ల ఫలితాలపై ఆధారపడవల్సి ఉంది. ఇక ఈ ఓటమితో బంగ్లాదేశ్ ఆడిన 7 మ్యాచ్ లలో ఒకటి మాత్రమే గెలిచి టోర్నీ నుండి నిష్క్రమించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version