షాకింగ్; ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు…!

-

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అవును ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసి చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే విద్యుత్ చార్జీలను కూడా పెంచాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఈ మేరకు సూచనలు కూడా ఇచ్చినట్టే కనపడుతుంది.

దీనిపై మంగళవారం ఏపీఎస్పీడీసీఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ) సీఎండీ హెచ్‌.హరనాథరావు ఒక ప్రకటన చేసారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈ నెల 9, 10, 11 తేదీల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని ఆయన ప్రకటించారు. 9న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో, 10న కడప జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో,

11న తిరుపతి ఎస్పీడీసీఎల్‌ కార్యాలయ సమావేశ మందిరంలో చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆ తర్వాత రెండు గంటల నుంచి సాయంత్రం 4;30 నిమిషాల వరకు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచేది లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version