ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల పండగ జరుగుతుంది. రాజకీయంగా బలంగా ఉన్న అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా అయినా సరే గెలిచి విపక్షాన్ని మానసికంగా కూడా దెబ్బ కొట్టాలని, క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి షాక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల పలు సమీక్షా సమావేశాలను నిర్వహించి మంత్రులకు పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఎలా అయినా ఎక్కువ పంచాయితీలను ఏకగ్రీవం చెయ్యాలని ఆయన ఆదేశించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పంచాయితి ఎన్నికలను జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇక్కడ గెలిస్తే మాత్రం గ్రామాల మీద పూర్తి స్థాయి పట్టు చిక్కే అవకాశం ఉంటుంది. రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు ఈ నెల 27, 29వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నా జగన్.
గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆయా గ్రామాలకు, గ్రామ పంచాయతీలో జనాభాను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాలని భావించి, ఇప్పటికే పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. దీనిపై త్వరలో జీవో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ఎన్నికలను ముఖ్యమంత్రి జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.