కేసీఆర్‌ను ఫాలో ఫాలో అంటోన్న జ‌గ‌న్‌…!

-

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు షురూ అయ్యాయి. ఈ నెల చివ‌రినాటికి ఎన్నిక‌లు పూర్తి చేయ‌డంపై ప్ర‌బుత్వం అన్ని విధాలా సిద్ధ‌మైంది. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో త‌లెత్తిన గంద‌ర‌గోళం ఒక‌ప‌క్క సాగుతున్నా.. త‌న పార్టీ ప‌రంగా అధికార పార్టీ బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే, అస‌లు జ‌గ‌న్ వ్యూహం ఏంటి? ఈ ఎన్నిక‌ల‌ను ఆయ‌న ఎలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు ముందు త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై అస‌లేం జ‌రిగింది? ఆయ‌న వ్యూహం ఎలా ఉంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో మెజారిటీ మేధావుల మాట‌.. జ‌గ‌న్ స్థానిక ఎన్నిక‌ల్లో తెలంగాణ ఫార్ములాను వినియోగిస్తున్నార‌ని అంటున్నారు.

కొన్ని రోజుల కింద‌ట తెలంగాణ‌లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అక్క‌డి అధికార పార్టీ భారీ ఎత్తున క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్ర‌మంలో అక్క‌డి సీఎం కేసీఆర్‌.. స్థానిక ఎన్నికల‌ను ఎలా డీల్ చేశారో.. అచ్చు అదేవి ధంగా ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఫాలో అవుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అక్క‌డ పార్టీ బాధ్య‌త‌ల ను, ఎన్నిక‌ల్లో గెలుపు బాధ్య‌త‌ను కూడా కేసీఆర్‌.. కొంద‌రు మంత్రుల‌కు అప్ప‌గించారు. మంత్రి ప‌ద‌వులు ఆశించేవారికి ఈ ఎన్నిక‌ల‌ను టార్గెట్‌గా పెట్టారు. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న‌వారు… ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల‌ని కేసీఆర్ ఆదేశించారు. అయితే, ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఇంత అని నిధులు విడుద‌ల చేశారు.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. నిధుల విష‌యంలో కొంత తేడా క‌నిపిస్తున్నా.. ఓవ‌రాల్‌గా చూసుకుంటే.. తె లంగాణ ఫార్ములానే ఇక్క‌డ కూడా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. నిజానికి అంత‌కు మించి క‌నిపిస్తోంద‌ని అనేవారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ కూడాసీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను దాదాపుగా మంత్రు ల‌పైనే మోపారు. అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేల‌కు కూడా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ, తెలంగాణ‌లో మాది రిగా నియోజ‌క‌వ‌ర్గానికి ఇంత అని ఇవ్వ‌కుండా.. ఆది నుంచి కూడా అనేక ప‌థ‌కాల‌ను అన్ని నియోజ‌క‌వ‌ర్గా ల్లోనూ అమ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో డ‌బ్బులు, మ‌ద్యం పంచ‌కుండానే ఈ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌నేది జ‌గ‌న్ వ్యూహం. సో.. మొత్తానికి తెలంగాణ‌లో హిట్టయిన ఫార్ములాతో ఇక్క‌డ కూడా దూసుకువెళ్తున్న జ‌గ‌న్‌కు సూప‌ర్ డూప‌ర్ హిట్ ల‌భిస్తుందా? చూడాలి! అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version