కాంగ్రెస్ అనేది ఒక సముద్రం… అదో సుధీర్గ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. దాదాపు 60 ఏళ్ళు దేశాన్ని పాలించింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అది సుదీర్గం గా పాలించింది. ఆ పార్టీలో ఎంతో పోటీ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ నేతలు పదవుల కోసం పోటీ పడుతూ ఉంటారు. రాజకీయంగా ఆ పార్టీ బలంగా ఉన్నా లేకపోయినా సరే పదవుల కోసం నేతలు ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఒక్కో పదవి కోసం పదుల సంఖ్యలో నేతలు పోటీ పడుతూ ఉంటారు.
ఇలా ఆశపడుతున్న వారిలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. ఆయన తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం కర్ణాటకలో తనకు సన్నిహితంగా ఉండే ఒక కాంగ్రెస్ పెద్దను కూడా రేవంత్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కలిసారు కూడా. అయితే ఇప్పుడు ఆయనకు ఆ పదవి రావడం లేదు. దానికి తోడు రేవంత్ రెడ్డి భూ దందాల మీద,
కాంగ్రెస్ పార్టీ నేతలే అధికార తెరాస పార్టీకి లీకులు ఇచ్చారని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన్ను ఎక్కువగా ట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలే. దీనితో రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీని వీడటానికి సిద్దమయ్యారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయనకు కాంగ్రెస్ నుంచి మద్దతు వచ్చే అవకాశం కనపడట౦ లేదు అనే టాక్ వినపడుతుంది. కాబట్టి ఆయన బలమైన పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే బిజెపి నేతలతో రేవంత్ టచ్ లోకి వెళ్ళారు అనేది జనాల మాట. రేవంత్ రెడ్డి కోసం బిజెపి ఎప్పటి నుంచో అడుగులు వేస్తుంది. కాబట్టి ఆయన్ను పార్టీలోకి తీసుకుని పదవి కూడా ఇవ్వడానికి సిద్దమయ్యారు బిజెపి నేతలు. కిషన్ రెడ్డి కూడా ఇటీవల ఆఫర్ ఇచ్చారు ఆయనకు. దీనితోనే రేవంత్ రెడ్డి పార్టీ మారడంపై పెద్ద చర్చలు జరుగుతున్నాయి. భూ దందాల నుంచి బిజెపి తనను కాపాడే అవకాశం ఉందని అంటున్నారు.