ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి ముస్లిం ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చే అవకాశం ఉందా…? ఇప్పుడు వస్తున్న వార్తలను చూస్తే అదే నిజమనే అనుమానం వస్తుంది. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి ఇంకా స్పష్టత రావడం లేదు. వ్యతిరేకిస్తున్నామని చెప్పారు గాని పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి వ్యతిరేక తీర్మానం చేసి కేంద్రానికి పంపలేదు. వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు అన్నీ ఇప్పటికే తీర్మానం పంపించాయి కూడా.
దీనిపై ఆ పార్టీ వైసీపీ ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తమవుతుంది. తీర్మానం చెయ్యాలని వాళ్ళు కోరుతున్నా జగన్ నుంచి స్పష్టత రావడం లేదు. గుంటూరు, కర్నూలు, కడప, కృష్ణా జిల్లాల్లో ముస్లిం ల సంఖ్య ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయినా సరే జగన్ మాత్ర౦ ఎక్కడా స్పష్టత ఇవ్వడం లేదు. దీనితో ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీకి ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయడానికి సిద్దమవుతున్నారు.
చాంద్ బాషా, ముస్తఫా సహా కొందరు పదవులకు రాజీనామా చేస్తామని కూడా ప్రకటించారు. ఇటీవల ముస్తఫా ఇదే విషయాన్ని చెప్పారు. తీర్మానం చెయ్యాల్సిందే అంటున్నారు. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో దేశం అట్టుడికి పోతుంది. రాష్ట్రంలో కూడా రాజకీయం దీని కేంద్రంగా వేడెక్కే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.