తెలుగు సినీ పరిశ్రమను కొత్త సమస్య కలవరపెడుతుందా..కథల విషయంలో క్లారిటీ లేకే రీమేక్ లకు స్టార్ హీరోలు ఒకే చెబుతున్నారా ఇప్పుడు ఈ విషయం పైనే టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. టాలీవుడ్ ని రచయితల సమస్య గట్టిగానే వేదిస్తుంది.గతంలో మాదిరిగా చెప్పుకోదగ్గర రైటర్స్ ఎవరు ఇప్పుడు మనకు కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా వారంతా గోస్ట్ లుగానే కంటిన్యూ అవుతున్నారు తప్ప ఫోకస్ అవుతుంది లేదు. ఏ పరిశ్రమలోను లేనంతగా రైటర్స్ లేమితో బాధపడుతోన్న తెలుగు సినీ పరిశ్రమ పై స్పెషల్ స్టోరీ.
తెలుగు పరిశ్రమలో ఓ స్టార్ దర్శకుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ సిట్టింగ్స్ లో ఉంది అనగానే.. ఆ ప్రాజెక్ట్ తాలుకు రైటర్ ఎవరో ఇట్టే చెప్పేస్తారు.సినిమా ఎంతటి ఎంటర్ టైనర్ గా ఉంటుందో ముందుగానే లెక్కలు వేసేస్తారు.ఐతే ఇదంతా గతం.మొన్నటివరకు సేమ్ టీం అనుకున్నవారంతా ఇప్పుడు సొంత కుంపట్లు పెట్టుకోవడంతో రెంటికి చెడుతున్నారు.దీంతో కొత్తగా వచ్చే కాంబోలకు క్రేజ్ లేకుండా పోతుంది.
అవ్వడానికి ,అనుకోవడానికి, అంతకు మించి చెప్పుకోడానికి వారంతా స్టార్ రైటర్సే .ఐతే ఒకప్పటి పెన్ పదును ఇప్పుడు కనిపించడం లేదు.ఏదో రాసామంటే రాస్తున్నారు తప్ప…వారి డైలాగ్ లు మునుపటి స్థాయిలో ఉండడం లేదు.కొందరైతే మనకెందుకొచ్చిన రైటింగ్ అనుకుని ఏకంగా యాక్టింగ్ లోకి దూకేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రైటింగ్ స్కిల్స్ పరంగా కనిపిస్తున్న డ్రా బ్యాక్స్ ఇంతలా హైలెట్ అవ్వడానికి నేటితరం స్టార్ డైరెక్టర్సే కారణమనే టాక్ ఉంది.అప్పటివరకు స్టార్ రైటర్స్ గా చలామణి అయినవారంతా నేడు దర్శకులుగా మారిపోవడంతోనే పరిశ్రమకు రైటర్స్ సమస్య ఇంతలా వచ్చిపడిందంటున్నారు.
ఇప్పుడున్న యువ దర్శకులలో కొందరికి మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి.కాకపోతే అయినకాడికి, వచ్చినకాడికి టాలెంట్ ను అమ్మేసుకుంటున్నారు.అక్కడితో ఊరుకోకుండా తమ ఆఫీసుల్లో రైటింగ్ టీంలను ప్రోత్సహిస్తూ మంచి స్టోరీలు తయారు చేయించుకుంటున్నారు. ఓకే ఇదంతా బాగానే ఉంది. మరి వారిలోంచి ఒక్కరనంటే ఒక్కరినైనా పైకి తీసుకువస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతో కొంత చేతిలో పెట్టి అలా గోస్ట్ లుగానే ఉంచేస్తున్నారనే కామెంట్ ఉంది..
తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా సినిమాలను నిర్మించే నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు తమ ప్రొడక్షన్లో యువ రచయితలను పెంచి పోషిస్తున్నారు.వేలకు వేలు,లక్షలు ఇచ్చి వర్క్ చేయించుకుంటున్నారు.తీరా సినిమా టైటిల్స్ దగ్గరకి వచ్చేసరికి టీం ఎఫెర్ట్ పేరు చెప్పి స్కిల్ రైటర్ కు క్రెడిట్ దక్కకుండా చేస్తున్నారు. తెలుగు సినిమాకు ఇప్పుడు రైటర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేరు. రైటర్ కమ్ డైరెక్టర్సే మనకు కనిపిస్తారు.స్టోరీల వరకు తాము రాసుకుని డైలాగ్ వెర్షన్ వర్ధమాన రచయితల చేతిలో పెట్టేస్తున్నారు.దీనికి తగ్గట్లుగానే న్యూ ఏజ్ స్టోరీలను తామే పిక్ చేసుకుంటున్నారు.దీంతో తమ సినిమాలకు నోటెడె రైటర్స్ లేరనే మాట అంతగా హైలెట్ అవ్వనీయడం లేదు.