నాలుగేళ్ల తర్వాత యువకుడు నిరుద్యోగిలా బయటికి రావాలా?: చత్తీస్‌గఢ్ సీఎం

-

అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగల్ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌లో పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం రెండేళ్ల కోసం రిక్రూట్ చేయడం దేనికని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఈ స్కీమ్‌లో జాబ్ సంపాదించిన విద్యార్థి నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగిలా బయటికి రావాలా? అని ప్రశ్నించారు.

చత్తీస్‌గఢ్ సీఎం

ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఏ దశలో భర్తీ చేస్తారని భూపేశ్ భగల్ తెలిపారు. ఒకవేళ పోలీసు దళంలోకి వాళ్లను తీసుకోకుంటే.. అప్పుడు ఏం జరుగుతుందని అడిగారు. తక్కువ సమయంలో వాళ్లకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. ఆ తర్వాత నిరుద్యోగులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. యువతను మధ్యలో వదిలేస్తే.. నేరగాళ్లుగా, అల్లరిమూకలుగా తయారవుతారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేశభద్రతను ఎలా కాపాడుతారని సీఎం భగల్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version