పిల్లల్ని ఎక్కడ పడుకో పెట్టాలి అనే సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది తల్లిదండ్రులతో పాటుగా పిల్లల్ని పడుకో పెట్టుకోవచ్చా లేదంటే వాళ్ళని విడిగా పడుకోపెట్టాలా..? దీనికి సమాధానం ఇప్పుడు మనం చూద్దాం. ఇంచుమించు అందరి తల్లిదండ్రులులో ఈ ప్రశ్న ఉంటుంది వాళ్లతో పాటుగా పిల్లల్ని పడుకో పెట్టుకోవచ్చ లేదంటే వాళ్ళని విడిగా పడుకోపెట్టాలా అని.. మామూలుగా మన దేశంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని 10 నుండి 12 ఏళ్ల వచ్చేవరకు కూడా వాళ్లతో పాటుగా పడుకోబెట్టుకుంటారు.
వాళ్లకి ప్రత్యేకమైన గదిని కేటాయించిన వాళ్లు నిద్రపోలేరు. కానీ దాంపత్య జీవితాన్ని దెబ్బతీస్తుంది పైగా పిల్లలు స్వతంత్ర భావాలు కలగకుండా అడ్డుపడినట్లు కూడా అవుతుంది అందుకని కచ్చితంగా వాళ్ళకి ప్రత్యేకమైన గదిని కేటాయించాలి. పిల్లలు ఎదిగే కొద్దీ వారిలో స్వేచ్ఛ స్వతంత్ర భావాలు కలుగుతూ ఉంటాయి చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం వేరే గదిని కేటాయించకుండా పిల్లలు పెళ్లి అయ్యే వరకు కూడా తల్లిదండ్రులు పక్కనే నిద్రపోమంటారు. పిల్లల్ని విడిగా పడుకోపెట్టడానికి భయపడతారు.
చిన్నారికి మూడు నెలల వయసు ఉన్నప్పటి నుండి వాళ్లని మీ మంచానికి దూరంగా పెట్టాలి కావాలంటే మంచం పక్కన ఉయ్యాల వేసి పడుకోపెట్టొచ్చు. 7 నెలల నుండి ఏడాది వయసు వచ్చేదాకా ఇలా చేయొచ్చు. ఏడాది దాటిన తర్వాత ప్రత్యేక గదిలో పడుకోబెట్టడం మంచిది అంటే రాత్రంతా వాళ్ళని ఒంటరిగా వదిలేయడం కాదు కొన్ని గంటల చొప్పున ఒంటరిగా వాళ్ళని ఉంచాలి. మధ్య మధ్యలో గమనించడం అవసరాలు తీర్చడం అవసరం.
ఇలా అలవాటు చేస్తే కొన్నాళ్ళకి ఒంటరిగా నిద్రపోతారు. ఒక కెమెరా బేబీ మానిటర్ ని మీరు ఫిక్స్ చేయొచ్చు. మొబైల్ కి కనెక్ట్ చేసి వాళ్ళకి కదలికలను గమనించొచ్చు. అలానే అందంగా పిల్లల గదిని అలంకరించండి. ఇంటికి అతిథులు వస్తే పిల్లలతో వాళ్ళని పడుకో పెట్టొద్దు. వాళ్ళని తల్లిదండ్రుల గదిలో ఉంచుకోవచ్చు అలాంటి సందర్భాల్లో.