రైతుల అందోళన పై టీఆర్ఎస్ ప్యూహం మార్చనుందా ?

-

రైతుల అందోళనకు మద్దతుకు భారత్ బంద్ లో ప్రత్యక్షంగా పాల్గోన్న టిఆర్ఎస్ ఇకపై ఏం చేయనుంది .. ఉదృతం అవుతున్న రైతుల అందోళనకు నేరుగా టిఆర్ఎస్ మద్దతు తెలుపుతుందా ? తెలంగాణ సియం కేసిఆర్ డిల్లీ పర్యటన తర్వాత రైతుల అందోళన విషయంలో టిఆర్ఎస్ వైఖరి ఏలా ఉండబోతుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.

బిజేపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వచ్చింది టిఆర్ఎస్ .పార్లమెంట్ లో ఆ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు కూడా వ్యతిరేకంగా ఓటు వేసింది టిఆర్ఎస్‌.ఈ మూడు చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని ఆరోపించింది. ఇటు దేశ రాజధాని డిల్లీలో మొదలుపెట్టిన రైతుల అందోళనకు మద్దతు ప్రకటించింది.రైతులు భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది టిఆర్ఎస్ .ఆ పార్టీ శ్రేణుల భారత్ బంద్ లో భాగంగా జాతీయ రహదారులను దిగ్బందించాయి.

తాజాగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాన మంత్రి మోదీ,హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు .ఈ భేటి రాజకీయంగా చర్చనీయశంగా మారింది .కేసిఆర్ డిల్లీ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది .ఇటు రాజకీయంగా వచ్చిన విమర్శలను తిప్పికొట్టింది టిఆర్ఎస్ .రాజ్యంగపరంగానే ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసిఆర్ భేటి అయినట్టు టిఆర్ఎస్ స్పష్టం చేసింది .కేసిఆర్ డిల్లీ పర్యటన తర్వాత చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది .

ఇప్పటికప్పుడు దేశ రాజధాని డిల్లీలో జరుగుతోన్న రైతుల అందోళన విషయంలో టిఆర్ఎస్ ఇకపై ఎటువంటి వైఖరిని ప్రదర్శించబోతుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది.రోజు రోజుకు డిల్లీలో రైతులు అందోళనను ఉదృతం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రత్యక్షంగా ఆ అందోళనకు మద్దతు పలుకుతుందా …పరోక్షంగానే సంఘీభావం కే మొగ్గుచూపుతుందా అన్న చర్చ జరుగుతోంది .

మూడు వ్యవసాయ చట్టాలపై టిఆర్ఎస్ నేతలు విమర్శలు కొనసాగుతునే ఉన్నాయి.వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆ మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు రక్షణ ఏక్కడ ఉంది అని ప్రశ్నించారు .వ్యవసాయ చట్టంలో కనీస మద్దతు ధర చట్టంను ఎందుకు చేర్చలేదు అని టీఆర్ఎస్ నేతలు విమర్షలు గుప్పిస్తున్నారు.ఢిల్లీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలతో టిఆర్ఎస్ రైతుల ఉద్యమం …అందోళన విషయంలో అడుగులు ఏలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది .

Read more RELATED
Recommended to you

Exit mobile version