వ్యాయామం చేసేటప్పుడు మాస్కులు ధరించాలా..?

-

జనాలు ప్రస్తుతం కరోనా వైరస్‌కు ఎంతగా భయపడుతున్నారో అందరికీ తెలిసిందే. కరోనా పేరు చెబితేనే ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మందికి కరోనా వైరస్‌ పట్ల అనేక సందేహాలు ఎదురవుతున్నాయి. వాటిల్లో ఒకటి.. ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు మాస్కులు పెట్టుకోవచ్చా, వద్దా..? అని.. అయితే ఇదే ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్కులను ధరించడం మంచిదే. అయితే వ్యాయామం చేసే సమయంలో మాస్కులను ధరించకూడదని మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. అలా చేస్తే వ్యాయామం సమయంలో శరీరం నుంచి విడుదలయ్యే చెమట మాస్కుకు అంటుకుని మాస్కు తడిగా అవుతుందని, అది సూక్ష్మక్రిములకు సరైన వాతావరణం అవుతుందని అన్నారు. అలాంటప్పుడు మాస్కులు వైరస్‌లను ఆకర్షిస్తాయని, అది ఎంతమాత్రం సురక్షితం కాదని అన్నారు. అందువల్ల వ్యాయామం చేసేటప్పుడు మాస్కులను ధరించకూడదని హెచ్చరించారు.

అయితే ఇండోర్‌లో వ్యాయామం చేసేటప్పుడు మాస్కులను ధరించాల్సిన పనిలేదు. కానీ బయటికి వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్కులను ధరించాలి కదా. అలాంటప్పుడు బయట మాస్కులు లేకుండా వ్యాయామం ఎలా చేస్తారు ? అది ఇంకా ప్రమాదకరం. శ్వాస ఎక్కువగా పీల్చుకుంటాం కనుక.. వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది. కనుక వ్యాయామం కోసం ఎవరూ బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడం చాలా సురక్షితం. ఇంట్లోనే వ్యాయామం చేసుకుంటూ.. మాస్కులు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. అయితే ఇంట్లో హోం ఐసొలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు ఉంటే మాత్రం.. మళ్లీ ఆలోచించాలి.. సో.. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకానీ.. వ్యాయామం చేసేటప్పుడు మాస్కులు వద్దన్నారు కనుక.. మాస్కులు తీసేస్తాం అని గుడ్డిగా ఫాలో కాకూడదు.. కాబట్టి కరోనా పట్ల బీకేర్‌ఫుల్‌..!

Read more RELATED
Recommended to you

Exit mobile version