బిగ్ బ్రేకింగ్ : టాలీవుడ్ బ్యూటీ ఛార్మి ఇంట విషాదం..!

-

టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత ఛార్మి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె కుటుంబంలో ఒకరైన ఛార్మి అత్త కన్ను మూసారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ లో ఫోటోను పోస్ట్ చేస్తూ..”ఇక మీరు లేరు అనే మాటే వినలేకపోతున్నా.. కానీ జీవితంలో జరిగేది జరగక మానదు. నిన్ననే మనం చివరగా వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. కానీ అదే చివరిది అవుతుందని భావించ లేదు. మీరు లేరని తెలిసి మాటలు రావడం లేదు.. పైన స్వర్గంలో కూడా నీకు నచ్చినట్టుగా వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటావని అనుకుంటున్నాను.

పైన ఉన్న అప్పితో కలిసి ఎంతో అమూల్యమైన సమయాన్ని గడుపుతావని ఆశిస్తున్నాను. నిన్ను, నీ చిరునవ్వును మిస్ అవుతున్నా. నా ప్రియమైన ఆంటీ నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా” అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ‘ఫైటర్’ మూవీ నిర్మాణంలో భాగం పంచుకుంటోంది ఛార్మి.

Read more RELATED
Recommended to you

Exit mobile version