RRR : రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీతో పేప‌ర్లు చింపుతూ.. ర‌చ్చ చేసిన ఉపాసన

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి కాంబినేషన్ లో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రోజు పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోల‌తో ఒక రోజు ముందు నుంచే మెగా, నంద‌మూరి ఫ్యాన్ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. అభిమానులు, సెల‌బ్రెటీలు అని తేడా లేకుండా.. అంద‌రూ ఈ సినిమా చూడ‌టానికి క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ నిన్న రాత్రే.. మ‌హేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ లో ఫ్యామిలీతో వెళ్లి చూశాడు.

కాగ రామ్ చ‌ర‌ణ్ కూడా భ్ర‌మ‌రంభ థీయేట‌ర్ లో బెనిఫిట్ షో ను ఈ రోజు తెల్ల‌వారు జామున 3 :00 గంట‌లకు ఫ్యామిలీతో క‌లిసి చూశాడు. రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీతో పాటు.. డైరెక్ట‌ర్ రాజమౌళి కూడా వ‌చ్చాడు. అయితే ఈ సినిమా చూస్తున్న స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న.. ర‌చ్చ ర‌చ్చ చేసింది.

సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ స‌మ‌యంలో, నాటు నాటు సాంగ్ స‌మ‌యంలో పేప‌ర్లు చింపి పైకి చ‌ల్లుతూ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈల‌లు వేస్తున్న అభిమానుల పైకి పేప‌ర్ల‌ను చింపుతూ ర‌చ్చ చేసింది. కాగ ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version