“ఆర్ఆర్ఆర్” హిట్ అయినందుకు జంతువును బలిచ్చిన అభిమానులు

-

ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ప్రతి ష్టాత్మకంగా చూస్తున్న మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు చూస్తే మతిపోవాల్సిందే.

హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులిద్దరూ ఎవరికి వారు సెపరేట్‌గా బ్యానర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. టాకీసుల వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. బ్యానర్లకు కొన్ని చోట్ల అభిమానులు పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. అయితే.. అనంత పురంలో… ఆర్‌ఆర్‌ఆర్‌ హీరో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అందరూ ఆశ్చర్యపోయేలా సంబురాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరం పల్లి గ్రామంలో RRR సినిమా హిట్ అయినందుకు జంతువును బలి ఇచ్చారు తారక్ అభిమానులు. ఓ గొర్రెను తీసుకువచ్చి.. ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌ ముందు.. బలి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version