అన్ని ఇండస్ట్రీల్లో పాతుకు పోయిన పెద్ద సమస్య క్యాస్టింగ్ కౌచ్. మూవీల్లో ఛాన్సుల కోసం వస్తున్న అమ్మాయిలకు ఎదురవుతున్న పెద్ద సమస్యే ఇది. సినిమాల్లో అవకాశాల కోసం ఒకప్పుడు హీరోయిన్లు నోరు తెరిచి అడిగేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అవకాశం కావాలంటే అవసరం తీర్చాల్సిందే అన్నట్టు తయారయిపోయాయి రోజులు.
ఇక ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తమకు జరిగిన అనుభవాలను, అన్యాయాలను ధైర్యంగా చెబుతున్నారు. ఇక మీటూ ఉద్యమం ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఇదే కోవలో ఇప్పుడు మరో నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.
పచ్చీస్, సైకిల్ మూవీల్లో నటించిన శ్వేతా వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సంచలన ఆరోపణలు చేసింది. తాను అవకాశం కోసం ఓ ఆఫీస్‌కి వెళ్తే అక్కడ ఉన్న డైరెక్టర్ ఓ ప్రొడ్యూసర్ కోసం కమిట్‌మెంట్ ఇస్తారా అని డైరెక్ట్ గా అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ తాను మాత్రం అందుకు ఒప్పుకోలేదని, కేవలం తన ట్యాలెంట్‌ను నమ్ముకునే పైకి వచ్చానని తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.