కడప జిల్లా పులివెందుల్లో ఎస్ఐ చేసిన సాహసం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పులివెందుల ఎస్ ఐ గోపినాధ్ రెడ్డి రహదారి మీద వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో ఒక కారు ఆపమంటే ఆపకుండా ముందుకు వెళ్ళింది. దీంతో ఆ కారుపై సినీ ఫక్కీలో దూకిన ఎస్ఐ గోపినాధ్ రెడ్డి దాని మీదే ఉండిపోయారు. రెండు కిలోమీటర్ల మేర ఆపకుండా వెళ్ళే కారు పైనే కారు ఆపమని ఎస్ఐ పెనుగులాడాడు.
ఎస్ఐని కారుతో ఢీకొట్టి అయినా వెళ్ళిపోవాలని డ్రైవర్ ప్రయత్నం చేశాడు. చివరకు మోకాళ్ళతో కారు అద్దం పగులగొట్టి డ్రైవర్ ను అదుపు చేశాడు ఎస్ఐ. అయితే ఈ క్రమంలో ఆయన కాళ్ళకి స్వల్ప గాయాలయ్యాయి. ఇక కారు ఆగాక కారులో అక్రమంగా తరలిస్తున్న 82 మద్యం బాటిల్స్ ను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్ గతంలో ప్రధాన నగరాల్లో ఏటిమ్ లను పగులగొట్టి దొంగతనాలకు పాల్పడే వాడని గుర్తించారు. ఇప్పుడు మాత్రం అక్రమ మద్యం తెచ్చి అమ్ముతున్నాడని గుర్తించారు.