పరశురామ జయంతి ప్రత్యేకం : నారాయణుడి ఆరో అవతారం విశేషాలు ఇవే !

-

నారాయణుడు.. శ్రీ మహావిష్ణువు దశావతారాలు అంటే అందరీకి తెలుసు. ధర్మానికి గ్లాని కలిగినప్పుడుల్లా భగవంతుడు ఆయా అవతారాలను ఎత్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తాడు. స్థితికారకుడు దీనికోసం ఎత్తినవాటిలో పది అవతారాలు అత్యంత ప్రాధాన్యం కలిగినవి. వాటిలో పరశురామ అవతారం ఒకటి. నేడు అంటే వైశాఖ శుద్ధ తృతీయనాడు పరశురామ జయంతి సందర్భంగా ఆ మహా అవతార విశేషాలు తెలుసుకుందాం…

పరశురాముడు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఆరవ అవతారం, పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ రోజున అవతరించాడని స్కంద, బ్రహ్మాండ పురాణాలలో తెలుపబడ్డాయి. పరశురాముడిని భార్గవరామ, జమదగ్ని అని కూడా పిలుస్తారు. గాధి కుశ వంశపు రాజు, భృగు వంశపు చెందినా ఋచీక మహర్షి ఒకసారి గాధి వద్దకు వెళ్ళి గాధి కుమార్తె అయిన సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. అందుకు గాధి తనకు నున్నటి శరీరం, నల్లటి చెవులున్న వెయ్యి గుర్రాలను ఇవ్వమని అడిగాడు. ఋచీక మహర్షి వరుణ దేవుడిని ప్రార్థించి వెయ్యి గుర్రాలు మహారాజు గాధికి ఇచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకున్నాడు. ఒక రోజు సత్యవతి ఋచీక మహర్షి దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరుకుంది. అందుకు సిద్ధపడిన ఋచీక మహర్షి యాగం చేసి విప్రమంత్ర పూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్ర పూతం అయిన ఒక హవిస్సు సిద్ధంచేసి స్నానానికి నదికి వెళ్ళాడు.

విషయం తెలియని సత్యకాతి రాజమంత్ర పూతం అయిన హవిస్సును తాను తీసుకుని విప్రమంత్ర పూతం అయిన హవిస్సును తల్లికి ఇస్తుంది. తిరిగి వచ్చిన ఋచీక మహర్షికి, సత్యవతి జరిగిన విషయం తెలిపి ప్రాధేయపడింది. ఋచీక మహర్షి తన కొడుకు సాత్వికుడిగా, మనవడు ఉగ్రుడిగా పుడతారు అని తెలిపాడు. ఋచీక మహర్షి కుమారుడు జమదగ్ని, జమదగ్ని కుమారుడు పురుషోత్తమ అంశతో జన్మించినవాడు పరశురాముడు. గాధి కుమారుడు విశ్వామిత్రుడు. జమదగ్నికి కూడా కోపం ఎక్కువే, ఆయన పత్నిరేణుకాదేవి, జమదగ్ని రేణుకల చిన్న కొడుకు పరశురాముడు. హైహయ వంశస్థుడు అయిన కార్తవీర్యార్జునుడికి శాప వశాత్తున చేతులు లేకుండా జన్మించాడు. భక్తిశ్రద్ధలతో ఘోర తపస్సు చేసి, దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని వేయి చేతులు పొందుతాడు. ఒకసారి కార్తవీర్యార్జునుడు వేటకోసం వచ్చి, అలసిపోయి జమదగ్ని ఆశ్రమం చేరుకుంటాడు. జమదగ్ని మహారాజుతో పాటు అతని పరివారానికి కూడా పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు.

జమదగ్ని మహర్షి వైభవం చూసి ఆశ్చర్యపడిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యంగా దీనికి కారణం ఏమిటి ఇది ఎలా సాధ్యమయింది అని అడిగాడు. దానికి జమదగ్ని తన వద్ద కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకు ఇవ్వమని కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని కోరాడు. జమదగ్ని నిరాకరించడంతో కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తన వెంట తోలుకువెళ్ళాడు. ఇంటికి వచ్చిన పరశురాముడికి విషయం తెలిసి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని వేయి చేతులు, తలను తన పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి తెలిపగా జమదగ్ని పరశురాముడిని పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మని తెలుపగా పరశురాముడు ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు.

 

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version