Friendship Day : ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. వీరికంటే శత్రువే బెటర్‌.. ఫేక్‌ ఫ్రెండ్స్‌

-

ప్రతీ బంధంలో ఉన్నట్టుగానే స్నేహంలో కూడా ఫేక్‌ ఫ్రెండ్స్‌ ఉంటారు. ఫ్రెండ్‌ షిప్‌ డే రోజు ఫేక్‌ ఫ్రెండ్స్‌ గురించి ఎందుకండీ అంటారా.. ఈ ఫేక్‌ ఫ్రెండ్స్‌ వల్ల మంచి ఫ్రెండ్స్‌ దూరం కావచ్చు.. నిజమైన ఫ్రెండ్‌ మనకు అవసరమున్నప్పుడు తోడుగా అండగా నిలబడతాడు. మన మంచిని కోరుకుంటాడు.. మన ఎదుగుదలకు తోడ్పడతాడు. మనల్ని సంతోషంగా చూడాలనుకుంటాడు.. అలాంటి ఫ్రెండ్స్‌ ఉండటం ఎంత అదృష్టమో.. మంచి ఫ్రెండ్స్‌ని దూరం చేసుకోకుండా ఫేక్‌ ఫ్రెండ్స్‌ని దగ్గరికి రాకుండా చూసుకుంటే మంచిది.

కష్టం అంటే కంటికి కనిపించరు

మీరు బాగుంటేనే మీ వెనుక ఉండేవారు, మీ కష్టాలను షేర్‌ చేసుకోవడంలో అయిష్టత చూపించే వారు మీకు స్నేహితుడా..? మీరు వివరించే సమస్యలలో కూడా వారికి లాభం ఏ విధంగా చేకూరుతుందో ఆలోచిస్తారు. వీరికి బాధలు వినాలనేది ఉండదు ఏదో ఒకలా టాపిక్‌ డైవర్ట్‌ చేస్తుంటారు.. కష్టం అంటే సహాయం చేయడం దేవుడెరుగు.. మీ కష్టంలోంచి లాభం పొందాలనుకుంటారు.. ఒక వేళ మీకు అలాంటి ఫ్రెండ్‌ ఉంటే జాగ్రత్త మరి.

బ్యాక్‌ బీటింగ్‌.. కమాన్‌ గుస గుస

చాలా డేంజరస్‌ లక్షణం ఇది.. మీ గురించి మీ వెనకాల గుస గుసలాడటం. మీ గెలుపును తక్కువ చేసి చూడటం. మీ ఆలోచనా విధానాన్ని లోకువ చేయడం లాంటి పనులు చేసే ఫ్రెండ్‌ కూడా ఫ్రెండేనంటారా..? ఈర్ష్యతో మీ గురించి వేరే వారితో చెడుగా చెప్పటానికీ వెనుకాడని ఫేక్‌ ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.

శత్రువే బెటర్‌

ఇక ఫ్రెండ్‌ అనే అర్థానికి వ్యతిరేకంగా ఉండేవాడు వీడు.. వీడి కంటే శత్రువే బెటర్‌.. పక్కలో బల్లెంలా ఉండటం వీడి మెంటాలిటీ.. మీ బాధే వీరికి ఆనందం కలిగిస్తుంది. మీరు బాధ పడుతూ ఉంటే మీ బాధలు వింటూ ఎంజాయ్‌ చేస్తుంటారు. మీ కాన్ఫిడెంట్‌ని దెబ్బ తీస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసేలా చేస్తారు. ఇలాంటి బమ్‌ చిక్‌ గాళ్లతో దూరంగా ఉండటమే బెటర్‌ కదా..

ఇలా మన మనసుకు తెలుస్తుంది ఫ్రెండ్‌ ఎవరు ఫేక్‌ ఫ్రెండ్‌ ఎవరూ అని.. కాకపోతే మనం అలా వాళ్ల గురించి ఆలోచించక పోవడం వారికి వరం.. సో.. ఫేక్‌ ఫ్రెండ్స్‌ని గుర్తించి దూరంగా ఉంచడం అన్నింటికీ మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version