నల్గొండ జిల్లాలో ఆగస్టు 14 వరకు స్వచ్ఛందంగా లాక్ డౌన్

-

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో నల్గొండ జిల్లాలో నేటి నుంచి ఆగస్టు 14 వరకు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.స్థానిక వ్యాపార సంఘలైన బట్టల దుకాణాలు,స్వీట్స్, బేకరి తదితర వాణిజ్య్ కేంద్రాలు లాక్​డౌన్​ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Kancharla Bhopal Reddy

శ్రావణమాసం పెళ్లిలు, రాఖీ పండుగ, ఉండటం వల్ల వాణిజ్య కేంద్రాల వారు ఆలోచిస్తుండగా.. కరోనా విస్తరిస్తున్నందున దుకాణాదారులు తప్పనిసరిగా లాక్​డౌన్​ పాటించాల్సిందే అంటున్నారు.ఇప్పటికే కిరాణం, జనరల్ స్టోర్స్ వంటి కొన్ని దుకాణాలు లాక్​డౌన్ పాటిస్తున్నారు. జిల్లాలోని కనగల్, తిప్పర్తి,మాడ్గులపల్లి మండలాలు ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నాయి. ఆయా మండలాల్లో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గటలవరకు వ్యాపార కేంద్రాలు మూసివేసి.. స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు.

ఇకపై.. జిల్లా కేంద్రంలో అన్ని వ్యాపార సంఘాలు మాత్రం ఆగష్టు నాలుగు నుండి లాక్​డౌన్ పాటిస్తామని ప్రచారమవుతున్న వాట్సప్​ సమాచారాలు నమ్మవద్దని, జులై 30 నుంచే లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్టు, జిల్లాకేంద్రంలోని వ్యాపార కేంద్రాలన్ని తప్పనిసరిగా లాక్​డౌన్​ పాటించాల్సిందే అని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version