పట్టు లాంటి జుట్టు కోసం ఇలా చేయండి..

-

కురులు అంటేనే మనకు గుర్తుకు వచ్చే రంగు నలుపు. నల్లని కురులు ఒక ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటుంది.. నల్లని రంగుతో పాటు మీ జుట్టు సిల్కీగా ఉంటే ఇక ఏమాత్రం సందేహం లేదు.. మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉన్నట్లే. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన నలుపు రంగును పొందే  సహజ పదార్థాలను ఉపయోగించి సహజమైన పద్ధతుల ద్వారా నల్లని కురులను పొందవచ్చు. అది ఎలాగంటారా..?

1. రంగు జుట్టు: కొబ్బరిపాలు, అవకాడో మిశ్రమం రంగు జట్టుకు మేలుచేస్తుంది. అవకాడో, కప్పు కొబ్బరిపాలను మిక్సీలో వేసి చిక్కని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి టేబుల్‌ స్పూను తేనె, నిమ్మరసం కలిపి, జుట్టుకు పట్టించాలి.

2. మృదువైను కురులు: బాగా మగ్గిన రెండు అరటి పండ్లు, రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ నూనె, టేబుల్‌ స్పూను తేనెతో మాస్క్‌ను తయారుచేసుకోవాలి. ఈ మాస్క్‌ను కేశాలకు అప్లై చేస్తే కురులు సున్నితంగా మారతాయి. ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల లావెండర్‌ నూనె లేదా రోజ్‌ మేరీ నూనె కూడా కలపొచ్చు.

3. పొడి, దెబ్బతిన్న కేశాలు: వీటికి తేనె చక్కగా పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొన, తేనె, కొబ్బరినూనెతో తయారుచేసుకున్న హెయిర్‌మాస్క్‌ వెంట్రుకలకు తేమ, ప్రొటీన్లను అందించి కురులను మెరిసేలా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు రాసుకున్న 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

4. మామిడి పండు మరియు మామిడి ఆకుల హెయిర్ ప్యాక్ : కొన్ని మామిడి ఆకులు మరియు పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని మిక్సీలో రుబ్బి పేస్ట్ లాగా చేసుకోవాలి. నీటికి బదులుగా ఈ పేస్ట్ కొరకు ఏదైనా నూనెని వాడాలి.. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చాలా సమయం ఎండలో ఎండబెట్టాలి. అలా బాగా ఎండిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుభ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు.. రోజూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిండైన, బలమైన కురులు మీ సొంతమవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version