రామగుండం సింగరేణి గని ప్రమాదం….19 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్, గల్లంతైన వారి కోసం గాలింపు

-

పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ సింగరేణి గనిలో జరిగిన ప్రమాదంలో 19 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న గనిపైకప్పు కూలి నలుగురు కార్మికులు మరణించారు. పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గల్లంతయిన వారిలో ముగ్గురు కార్మికులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారిలో సెఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది నిన్నటి నుంచి శ్రమిస్తోంది.  

86 లెవెల్ లో బొగ్గు పైకప్పును మ్యానువల్ గా బొగ్గు ను తొలిగిస్తుంది రెస్య్యూ టీం. బొగ్గ పెల్లల కిందనే కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. బొగ్గు కుప్పల నుంచి కార్మికుల అరుపులు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. 12 మీటర్ల మందంతో బొగ్గుపైకప్పు కూలింది. గత 15 రోజుల క్రితం నుంచి బొగ్గు పైకప్పు నుంచి పెచ్చులు రావడంతో సిబ్బంది మరమ్మతులు చేస్తోంది. ఈ సమయంలోనే కార్మికులపై బొగ్గు పెల్లలు విరిగిపడ్డాయి. సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version