సింగరేణి వేలంపై పార్లమెంట్‌లో చర్చ.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..?

-

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అయితే.. పార్లమెంట్‌ సమావేశాల్లో సింగరేణి కోల్ మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. లోక్ సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కల్యాణ్ గని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణిపల్లి కోల్ బ్లాక్స్ వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ చెప్పారని లోక్ సభ దృష్టికి తెచ్చారు. ఇచ్చిన హామీని విస్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరంగా చేసే దిశగా అడుగులు వేస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించగా.. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు.

సిస్టమ్ ప్రకారమే కోల్ మైన్స్ వేలం జరుగుతుందన్నారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతమేనని..అలాంటప్పుడు ప్రైవేటీకరణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. అంతేకాకుండా.. సింగరేణి సౌత్ ఇండియాలో అతిపెద్ద కంపెనీ అని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్ రెడ్డితెలిపారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోతారని చెప్పారు. సింగరేణిలో రాష్ట్రప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version