Breaking : హైదరాబాద్‌ వాసులకు ఆర్టీసీ శుభవార్త..

-

టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కరోనా తరువాత పూర్తిస్థాయిలో బస్సుల్లో ప్రయాణీకులు ప్రారంభించడం గత కొద్ది రోజులుగా పెరిగింది. దీంతో.. బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో.. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు చర్యలు చేపట్టింది ఆర్టీసీ. ఇక నుంచి కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ఆర్టీసీ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో 1,020 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆర్టీసీ ఇప్పటికే వెల్లడించింది. కొత్తగా కొనుగోలు చేయనున్న బస్సుల్లో సూపర్ లగ్జరీ, ఎలక్ట్రికల్ బస్సులు ఉండనున్నట్లు వెల్లడించారు ఆర్టీసీ అధికారులు. కొత్తగా కోనుగోలు చేయనున్న వాటిల్లో 720 సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయని.., వీటిని జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు.

 

జిల్లాల్లో ఇప్పటికే తిరిగి పాతబడిపోయిన సూపర్ లగ్జరీ బస్సులను గ్రేటర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పాత బస్సులను మియాపూర్ బస్ బాడీ బిల్డింగ్ స్టేషన్‌కు తరలించి అక్కడ వాటిలో మార్పులు చేసి సిటీ బస్సలుగా తయారు చేయనున్నట్లు పది రోజుల క్రితమే తెలిపారు. ఆ దిశగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాదికి 300 ఎలక్ట్రిక్ బస్సులు సమకూరేలోపు అదనంగా 700 బస్సులు సమకూర్చే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి ప్రయాణికుల సౌకర్యార్థం సూపర్ లగ్జరీ బస్సులను సిటీ బస్సులుగా మార్పులు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version